ETV Bharat / state

నీటి సమస్య చెప్పినందుకు.. గిరిజన యువకుడికి వైసీపీ నాయకుడి బెదిరింపు - YCP leader attack on tribal youth

YCP leader attack on tribal youth: వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతుంది. ఎక్కడ చూసినా దాడులు, బెదిరింపులే.. పల్నాడు జిల్లాలో నీటి ఎద్దడి గురించి ప్రశ్నించినందుకు.. అధికార పార్టీ ఎంపీపీ కుమారుడు భయాందోళనకు గురి చేస్తున్నారని బాధితుడు శ్రీను నాయక్ ఆరోపించారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురవయ్య నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితుడు కోరుతున్నారు.

YCP leader attack on tribal youth
YCP leader attack on tribal youth
author img

By

Published : Feb 23, 2023, 6:02 PM IST

YCP leader attack on tribal youth: త్రాగునీటి ఎద్దడి గురించి అడిగిన పాపానికి గిరిజన యువకుడిపై వైసీపీ నాయకుడు విరుచుకుపడ్డాడు. నీ అంతు చూస్తానని బెదిరించాడు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని బాధితుడు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. నీటి ఎద్దడి గురించి ప్రశ్నిస్తే బెదిరిస్తారా అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండంలంలో వేసవికి ముందే నీటి ఎద్దడి నెలకొంది. అయితే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మెప్పు పొందేందుకు అధికార పార్టీ ఎంపీపీ బత్తిన రాములు కుమారుడు, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ డైరెక్టర్ గురవయ్య అసత్యాలు ప్రచారం చేశాడు. అంతేకాకుండా ఇటీవల గ్రామ సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేసి.. గండిగనుముల గ్రామంలో నీటి సమస్య లేదని చెప్పాలని గ్రామస్థులను ఆదేశించాడు.

కానీ నీటిఎద్దడిపై శ్రీను నాయక్​ అనే యువకుడు స్పందించాడు. గ్రామంలో నీటి సమస్య ఉందని తాను వాట్సాప్​లో మెసెజ్​ షేర్​ చేసినట్లు తెలిపాడు. దీనిపై గురవయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఫోన్​ చేసి బెదిరించినట్లు శ్రీను నాయక్​ వివరించాడు. అంతటితో ఆగకుండా పలువురితో కలిసి దాడికి యత్నించాడన్నారు. బండ్లమోటు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు శ్రీను నాయక్​ తెలియజేశాడు.

గిరిజన యువకుడిపై వైసీపీ నాయకుడు బెదిరింపులు.. బయటకు వస్తే చంపేస్తానంటూ!

గత నెల రోజులుగా విపరీతంగా నీటి సమస్య ఉంది. దీంతో నేను ఈ సమస్య గురించి వాట్సాప్​లో పంపించడం జరిగింది. అలా పంపించడం వల్ల గురవయ్యగారు నాకు ఫోన్ చేసి నీ అంతు చూస్తాను.. సచివాలయం దగ్గరకి రా అని బెదిరిస్తున్నారు. అసభ్యంగా తిడుతున్నారు. నన్ను భయాందోళనకు గురి చేస్తున్నారు. గురవయ్య గారు ఇంటికొచ్చి బెదిరిస్తున్నారు. నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలి.- శ్రీను నాయక్, బాధితుడు

గురవయ్య అసభ్యకరమైన పదజాలంతో వ్యవహరించిన తీరు ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. వేసవి రాక ముందే పరిస్థితి ఇలావుంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.