ETV Bharat / state

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తాతా మనవడు మృతి - Guntur Kurnool Highway

Accident: బైక్​పై మనవడిని తీసుకుని వస్తున్నాడు తాత. చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే అనుకోని ప్రమాదం ఎదురైంది. వీరు ప్రయాణిస్తున్న బైక్​ను గిద్దలూరు డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తాతామనవడు ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరి మృతితో ఆ ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

Road Acciden
బస్సు ప్రమాదంలో తాతామనవళ్లు మృతి
author img

By

Published : Oct 3, 2022, 5:02 PM IST

Road Accident: పల్నాడు జిల్లాలో గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బైక్​ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వినుకొండ మండలం చీకటిగలపాలెం సమీపంలో సోమవారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం వినుకొండ నుంచి గిద్దలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. నూజెండ్ల మండలం చెరువుకొమ్మువారిపాలెం గ్రామానికి చెందిన బొబ్బ వేణుగోపాల్ రెడ్డి అతని మనుమడు మహేందర్ (13)​ను వినుకొండ తీసుకుని వస్తున్నాడు. చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే గిద్దలూరు డిపో ఆర్టీసీ బస్సు వీరి బైక్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేణుగోపాల్​ రెడ్డి ఘటనాస్థలంలోనే మరణించగా.. గాయాలైన మహేందర్​ను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.