IPL Cricket Bookies arrested: విజయవాడలోని అజిత్సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్టు చేశారు. పలువురు అక్కడ ఇళ్లు అద్దెకు తీసుకొని ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు చెప్పారు.
'ఈ క్రమంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 42 సెల్ఫోన్లు, నాలుగు ల్యాప్టాప్లు, ఏకాలంలో 20 లైన్లు కలిపే ఆన్లైన్ బోర్డును స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. బుకీ అకౌంట్లో ఉన్న రూ.48లక్షల నగదును స్తంభింపజేశాం. ఖరీదైన ఓ కారును స్వాధీనం చేసుకున్నాం' అని డీసీపీ తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్లను క్రికెట్ మజ్జా, క్రికెట్ లైవ్ గురు వంటి యాప్ల ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జూదం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఇదీ చదవండి: