Letter to DGP on security arrangements: ఈ నెల 27, 28వ తేదీల్లో జరగనున్న మహానాడుకు భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సిందిగా కోరుతూ డీజీపీకి, రవాణ ఏర్పాట్ల కొరకు ఆర్టీసీ ఎండీకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. రాజమహేంద్రవరం, కడియం మండలంలోని వేమగిరి గ్రామంలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మహానాడుకు లక్షలాదిమంది ప్రజలు హాజరవుతారని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయండని కోరారు. సాధారణ ప్రజలకు ఎటువంటి ట్రాపిక్ ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజలు మహానాడుకు విచ్చేసేందుకు అద్దె బస్సులు ఏర్పాటు చేయాల్సిందింగా డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్టీసీ ఎండీని కోరారు.
మహానాడు నిర్వాహక కమిటీలు: ఎలాంటి ఆటంకాలు జరగకుండా మహానాడు నిర్వహించడానికి, నిర్వాహక కమిటీ ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో సమావేశమై కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, వాలంటీర్లకు బాధ్యతల అప్పగింత, కమిటీల నియామకంపై నేతలు సూచనలు చేశారు. విజయదశమికి సమగ్రమైన, రాష్ట్ర భవిష్యత్తును మార్చే మ్యానిఫెస్టో విడుదల చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. మాహానాడులో 15 తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తామని మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.
15లక్షల మంది వస్తారని అంచనా: ఈ నెల 27, 28వ తేదీల్లో జరిగే మహానాడుకు రికార్డు స్థాయిలో తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు భారీగా తరలి రానున్నారని సోమిరెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ శతజయంతి, ఎన్నికల ఏడాది, ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో నిలుస్తుందని అన్నారు. 26వ తేదీన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుందని సోమిరెడ్డి వెల్లడించారు. 27న 15 వేల మందితో ప్రతినిధుల సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. 28న మహానాడులో బహిరంగ సభ నిర్వహిస్తామని సోమిరెడ్డి చెప్పారు. 28వ తేదీన జరగబోయే బహిరంగ సభకు 15లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ బస్సులు ఇవ్వడం లేదు: రాజమహేంద్రవరంతోపాటు గోదావరి జిల్లాలు పసుపు మయంగా మారనున్నాయని సోమిరెడ్డి తెలిపారు. వైసీపీ ఎంపీ భరత్ మాత్రం టీడీపీ హోర్డింగ్‌లు పెట్టేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని సోమి రెడ్డి మండిపడ్డారు. అలాగే మహానాడు కోసం ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. అయితే, సీఎం వైఎస్ జగన్ సభలకు మాత్రం ఆర్టీసీ బస్సులు పంపిస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చదవండి: