ETV Bharat / state

AP Velugu Employees Protest: సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం: వీవోఏ సంఘం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 9:40 PM IST

AP Velugu Employees Protest: కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ... రాష్ట్రంలో పలుచోట్ల వెలుగు వీవోఏలు ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అధికారులు పని ఒత్తిడి పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.

AP Velugu Employees Protest
AP Velugu Employees Protest
AP Velugu Employees Protest: సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తాం: వీవోఏ సంఘం

AP Velugu Employees Protest: కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని... హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ... వెలుగు ప్రాజెక్ట్​ వీవోఏ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్) రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన బాటపట్టారు. తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అధికారులు పని ఒత్తిడి పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఆందోళనల్లో పాల్గొంటున్న వీవోఏలను తొలగించాలని ప్రభుత్వం అధికారుల ద్వారా బెదిరింపులకు దిగడం సరికాదని పేర్కొన్నారు. వీవోఏలపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.

Tension at Anakapalli: ఇబ్బందులకు గురి చేస్తున్నారు: అనకాపల్లి కలెక్టరేట్ వద్ద వెలుగు వీవోఏ(Village Organization Assistant)ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనలో భాగంగా వీవోఏలు కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీవోఏలు మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, పని భారం పెరిగిందని వాపోయారు. పైగా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వీవోఏలు ఆరోపించారు. రూ.10వేల వేతనం అందించి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీవోఏలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధా నాగ జగదీశ్వరరావు సంఘీభావం తెలిపారు..

ఉద్యోగ భద్రత కల్పించాలని వీఏఓల ఆందోళన

36 Hours Dharna in Nandyala.. మూడు సంవత్సరాల కాలపరిమితి: వెలుగు ప్రాజెక్ట్​ వీవోఏ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్) ఉద్యోగుల సంఘం చేపట్టిన ముప్పై ఆరు గంటల ధర్నా నంద్యాలలో కొనసాగింది. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో జిల్లాలోని యానిమేటర్స్ పాల్గొన్నారు. మూడేళ్ల కాలపరిమితి విధానాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వీవోఏ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీవోఏ నాగ‌ల‌క్ష్మిది ఆత్మహ‌త్య కాదు.. వైకాపా నేత చేసిన హ‌త్య: లోకేశ్​

వీవోఏలపై రాజకీయ వేధింపులు ఆపాలి: వీవోఏ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ ధర్నా చౌక్​ వద్ద ఆంధ్రప్రదేశ్ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వీవోఏలు నిరసనకు దిగారు. మూడు సంవత్సరాల కాలపరిమితికి సంబంధించిన సర్క్యులర్​ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీవోఏలపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరారు. ఆందోళనల్లో పాల్గొంటున్న వీవోఏలను తొలగించాలని ప్రభుత్వం అధికారుల ద్వారా బెదిరింపులకు దిగడం సరికాదని యానిమేటర్ల సంఘం నాయకులు ఆరోపించారు. వీవోఏలకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని పేర్కొన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ పది లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని నేడు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

Velugu VOA Employees Agitation in Visakha: కష్టపడి పని చేస్తున్నా.. కనీస వేతనాలేవీ..? విశాఖలో వెలుగు వీవోఏల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.