ETV Bharat / state

ఆర్టీసీ బస్సు ఢీ.. వృద్ధుడు మృతి - kurnool latest news

కర్నూలు నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

old man died in a rtc bus accident at kurnool
ఆర్టీసీ బస్సు ఢీ కొని వృద్ధుడు మృతి
author img

By

Published : Apr 5, 2021, 5:54 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ మియా... కలెక్టరేట్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో అనంతపురం నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. షేక్ మహమ్మద్​ను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో వృద్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు... బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 1,326 కరోనా కేసులు.. 5 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.