2015లో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ దంపతుల కుటుంబానికి కర్నూలు జాతీయ లోక్ అదాలత్లో బీమా సంస్థ భారీ పరిహారం అందించింది. సుధాకర్ అనే వ్యక్తి కుటుంబం కడప జిల్లా రాజంపేట వద్ద ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో సుధాకర్ దంపతులు మరణించారు. మృతుడు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తూ.... ఏటా 12 లక్షల వేతనం తీసుకునేవారు. ఉద్యోగ విరమణ వయసును పరిగణలోకి తీసుకున్న బీమా సంస్థ.... పరిహారాన్ని కోటీ 75 లక్షలుగా లెక్కగట్టింది. ఈ మొత్తాన్ని ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన సుధాకర్ కుమారుడు తేజేష్ నానమ్మ, అమ్మమలకు అందించారు.
ఇదీ చదవండి: అదోనిలో అదృశ్యమైన వివాహిత కేసు ఛేదించిన పోలీసులు