ETV Bharat / state

ఉద్యోగం వదిలి వ్యవసాయం.. పండ్ల తోటల పెంపకంతో లాభాలు - drip irrigation news

వ్యవసాయంలో అధిక లాభాలు ఆర్జించేందుకు కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడో యువ రైతు. నీటి వృథాను అరికట్టేందుకు సూక్ష్మసేద్యం, ఆరోగ్యవంతమైన పంటల కోసం సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తున్నాడు. ఉద్యోగాన్ని వదిలి తనకున్న భూమిలో రకరకాల పండ్ల పంటలు పండిస్తూ.. లాభసాటి వ్యవసాయం చేస్తున్నానంటున్నాడు కర్నూలు జిల్లా గూడూరు మండలానికి చెందిన తరుణ్​ కుమార్​ యాదవ్​.

farming
పండ్ల తోటల పెంపకంతో లాభాలు
author img

By

Published : Feb 18, 2021, 1:36 PM IST

కర్నూలు జిల్లా గూడూరు మండలంలో ఓ యువ రైతు తన తల్లిదండ్రుల సహకారంతో సేంద్రియ ఎరువులు వినియోగిస్తూ.. సూక్ష్మ సేద్యంతో బంజరు భూమిలో బంగారు పంటలు పండిస్తున్నాడు. తమకున్న వంద ఎకరాల్లో 50 ఎకరాలు మామిడి తోట, ఎనిమిది ఎకరాలు దానిమ్మ తోటతో పాటు క్షేత్రంలో పన్నెండు రకాల పండ్ల తోటలను పెంచుతున్నామని రైతు చెబుతున్నాడు. అంజూర్, జామ, దానిమ్మ, మామిడి, బొప్పాయి, సపోటా, నారింజ, సీతాఫలం, రామా ఫలం, నేరేడు, చింత, రేగు, చెర్రీ వంటి పండ్లను పండిస్తున్నామని అన్నాడు.

తెరతో సిరులపంట:

క్షేత్రంలోని ఎనిమిదెకరాల దానిమ్మ తోటకు తెరను ఏర్పాటు చేశారు. ఇందుకు రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టారని రైతు పేర్కొన్నాడు. ఈ తోట నుంచి ఏటా దాదాపుగా 80లక్షల ఆదాయం పొందుతున్నాట్లు తెలిపాడు.

గోమూత్రం ఆవుపేడతో ఎరువులు:

తాను సాగు చేసిన పంటలకు గోమూత్రం ఆవు పేడ, బెల్లం, వేప నూనె, శనగపిండి వంటి వాటితో సేంద్రియ ఎరువులు తయారుచేస్తామని రైతు తెలిపాడు. పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి జీవామృతాన్ని ప్రతీ చెట్టుకు అందిస్తామని చెప్పారు.

పశువులు, కోళ్ల పెంపకం:

ఈ క్షేత్రంలో ఆవులు, నాటు కోళ్లు, టర్కీ జాతి కోళ్లు పెంచుతున్నారు. వీటికి దాణాగా అజోల్లా పెంచుతున్నారు.

రక్షణ పంటలు :

చింత, రేగు, టేకు, ఎర్రచందనం వంటి చెట్లను క్షేత్రానికి రక్షణగా ఉండేందుకు గట్లపై పెంచుతున్నారు.

యువరైతు తరుణ్​ కుమార్​ పంట క్షేత్రం

ఇదీ చదవండి: బాలింతరాలు అయినా.. బాధ్యత మరువలేదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.