కర్నూలు జిల్లా నందవరం మండలంలోని టి.సోములగూడూరుకు చెందిన నరసింహరెడ్డి అనే రైతు అప్పులబాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు ఉన్న మూడున్నర ఎకరాల పొలంతో పాటు మరి కొంత భూమి కౌలుకు తీసుకుని సాగు చేశాడు. వరుసగా పంట దెబ్బతిని నష్టపోయి అప్పులు పెరిగిపోవటంతో మనోవేదనతో పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎసై నాగరాజు తెలిపారు.
ఇదీ చూడండి: ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు