ETV Bharat / state

మృతదేహాలు తారుమారు...బంధువుల ఆందోళన - మృతదేహాలు తారుమారు...బంధువుల ఆందోళన

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలు తారుమారయ్యాయి. కరోనా పాజిటివ్ వచ్చిన మృతదేహం స్థానంలో నెగెటివ్ వచ్చిన వ్యక్తి మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది తీసుకువెళ్లి ఖననం చేశారు. మృతదేహం కోసం బంధువులు మార్చురీ వద్దకు వెళ్లి చూస్తే అక్కడ మృతదేహం కన్పించలేదు. దీంతో బంధువులు మార్చురీ ముందు ఆందోళనకు దిగారు.

మృతదేహాలు తారుమారు...బంధువుల ఆందోళన
మృతదేహాలు తారుమారు...బంధువుల ఆందోళన
author img

By

Published : May 12, 2020, 5:31 PM IST

కర్నూలు బుధవారపేటకు చెందిన వ్యక్తి ఈనెల 6న అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత మృతి చెందారు. ఆయాసం ఉండటంతో కరోనా పరీక్షలు చేసి వైద్యులు మృతదేహాన్ని తరలించారు. సదరు వ్యక్తికి పరీక్షలో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మృతదేహాన్ని తీసుకువెళ్లాలని బంధువులకు ఆసుపత్రి అధికారులు సమాచారం ఇచ్చారు. మార్చురీకి వెళ్తే అక్కడ మృతదేహం కన్పించలేదు. ఏం జరిగిందని వాకబు చేస్తే మరో వ్యక్తి కరోనా పాజిటివ్​తో మృతి చెందారని, ఆ వ్యక్తి మృతదేహంగా భావించి ఖననం చేశారని తేలింది.

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి మృతదేహం మాత్రం మార్చురీలోనే ఉంది. మృతదేహాన్ని తారుమారు చేసి నెగెటివ్ రిపోర్టు వచ్చిన వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేయడం పట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది చేసిన తప్పిదం కారణంగా ఇలా జరిగిందని బంధువులు వాగ్వాదానికి దిగారు.

విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ..

మృతదేహాల మార్పిడిపై కలెక్టర్ వీరపాండియన్​ స్పందించారు. ముగ్గురు సభ్యులతో కమిటీ వేశామని.. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. సమగ్ర విచారణతో వాస్తవాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నరేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో రామగిడ్డయ్యలు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.