ETV Bharat / state

తెలంగాణ వాహనాలు ఏపీలోకి రాకుండా భాజపా ఆధ్వర్యంలో ఆందోళన

author img

By

Published : May 14, 2021, 12:29 PM IST

Updated : May 14, 2021, 1:59 PM IST

పుల్లూరు టోల్‌గేట్‌: తెలంగాణ వాహనాలు ఏపీలోకి రాకుండా భాజపా ఆధ్వర్యంలో ఆందోళన

12:27 May 14

పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఏపీ వాసుల ఆందోళన

పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద అంబులెన్సుల నిలిపివేతను తెలంగాణ సర్కార్ కొనసాగిస్తోంది. ఏపీ నుంచి వెళ్లే అంబులెన్సులను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్న నేపథ్యంలో పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భాజపా ఆందోళన చేపట్టింది. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చే వాహనాలు రాకుండా అడ్డగిస్తామని రోడ్కెక్కింది. ఈ మేరకు భాజపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. తెలంగాణలోకి తమను రానివ్వనప్పుడు ఏపీలోకి ఎలా వస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెనక్కి పంపిస్తోంది..

ఓ వైపు ఆస్పత్రుల అనుమతి ఉంటేనే అనుమతిస్తామన్న తెలంగాణ…  ఆస్పత్రుల అనుమతి లేని వాహనాలను వెనక్కి పంపిస్తోంది.  

పుల్లూరు వద్ద అడ్డగింత..

ఈ క్రమంలో పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద కొద్దిసేపు ఆందోళన చేసిన ఏపీ వాసులు.. తెలంగాణ నుంచి ఏపీలోకి వాహనాలు రాకుండా అడ్డగింత చర్య చేపట్టారు. ఫలితంగా పుల్లూరు చెక్‌పోస్టు వద్ద టీఎస్ పోలీసులతో వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. 

ఏపీలో ఆందోళన చేసుకోండి : టీఎస్ పోలీస్

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వెళ్లి ఆందోళన చేసుకోవాలని తెలంగాణ పోలీసులు పేర్కొనడం గమనార్ఙం.

ఇవీ చూడండి : ఏపీ తెలంగాణ బోర్డర్ : మరోసారి అంబులెన్సులను నిలిపేసిన తెలంగాణ పోలీసులు

Last Updated : May 14, 2021, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.