Andhra Pradesh State Fiber Net Ltd: ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ రుణాల సేకరణకు ప్రభుత్వ హామీ ఇచ్చింది. ఈ మేరకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.181 కోట్ల రుణ సేకరణకు హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,846 గ్రామ పంచాయితీలకు కనెక్టివిటీ ప్రాజెక్టు కోసం ఈ మొత్తాన్ని రుణంగా తీసుకోవాలని ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ నిర్ణయించింది.
ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా 3283 కోట్ల రూపాయలను రుణంగా తీసుకునేందుకు ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీని మరోమారు పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 181.47 కోట్ల రూపాయలను బ్యాంకులు.. ఆర్థిక సంస్థల నుంచి రుణంగా తీసుకునేందుకు హామీ ఇచ్చింది.
ఇదీ చదవండి:
Adulterated toddy case: జీలుగు కల్లు ఘటన కేసులో నిందితుడు అరెస్టు