ETV Bharat / state

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి రేపే శ్రీకారం - krishna district

ఎన్నికల సందర్భంగా వైకాపా ఇచ్చిన హామీ అమలు దిశగా జగన్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్వయం సహాయక సంఘాల బలోపేతానికి సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో ప్రకటించిందిరు. ఈ హామీ కింద తీసుకున్న రుణాల తాలూకు వడ్డీని ప్రభుత్వం జమ చేయనుంది. ‘వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ’ పథకానికి 24వ తేదీన శ్రీకారం చుట్టనుంది.న్నారు. ఈ పథకం కింద కృష్ణాజిల్లాలో 70,253 మహిళా సంఘాలకు అర్హత లభిస్తోంది.

krishna district
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి రేపు శ్రీకారం
author img

By

Published : Apr 23, 2020, 4:30 PM IST

‘వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ’ పథకానికి 24వ తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు వడ్డీని.. మహిళా సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం రూ. 69.32 కోట్లు వడ్డీ లేకుండా రుణాలు అందనున్నాయి.

* తమ జీవనోపాధులు మెరుగు, ఆర్థిక ఆసరా కోసం రుణాలు తీసుకున్న సంఘాలకే ఈ పథకం వర్తించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో సంఘాలు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన సంఘాలు 52,498 ఉన్నాయి. వీటికి సున్నా వడ్డీ పథకం కింద రూ. 40.94 కోట్లు అందనుంది.

* మెప్మా పరిధిలోని ఎనిమిది పట్టణ ప్రాంతాల్లో మొత్తం 10,220 సంఘాలు ఉన్నాయి. వీటిల్లో సున్నా వడ్డీ పథకం పరిధిలోకి వచ్చేవి 7,576 సంఘాలుగా తేల్చారు. వీటిల్లో 82,233 మంది సభ్యులు ఉన్నారు. వీరికి రూ. 12.49 కోట్లు వడ్డీ మొత్తం దక్కనుంది. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 10,179 సంఘాలు అర్హమైనవిగా గుర్తించారు. ఈ సంఘాలలో మొత్తం 1.08 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరికి రూ. 15.89 కోట్లు ఖాతాలలో జమ అవనుంది.

* తీసుకున్న రుణంలో కొంత చెల్లిస్తే, ఆ మొత్తాన్ని కూడా తిరిగి వడ్డీ లేని రుణంగా తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. పథకం ప్రారంభించినాడే సంఘాలకు వారి ఖాతాల్లో జమ అయిన చెక్కులతో పాటు, సీఎం సందేశ లేఖను కూడా అందజేయనున్నారు. ఈ అవకాశాన్ని అన్ని సంఘాలు ఉపయోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, మెప్మా పీడీ డా. ప్రకాశరావు కోరారు.

ఇదీ చదవండి:

అడుగంటుతున్న నీరు.. తగ్గుతున్న నీటిమట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.