ETV Bharat / state

Dalit Associations round table ఎస్సీలు ఏకం కావాలి.. దళితుల రక్షణ కోసమైనా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి: మందకృష్ణ

Conference of Dalit Associations : జగన్ పాలనలో దళితులకు 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయారని.. విజయవాడలో ఎస్సీ నేతల రౌండ్ టేబుల్ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశానికి ఎస్సీ సంఘాల నేతలతో పాటు పలువురు మేథావులు హజరయ్యారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ నాలుగేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దళితులపై 8వేలకు పైగా దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 21, 2023, 8:09 PM IST

Updated : May 21, 2023, 9:19 PM IST

Conference of Dalit Associations : వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు గతంలో ఎప్పుడూ లేనంతగా అన్యాయం జరుగుతోందని దళిత నేతలు, నాయకులు గళమెత్తారు. రాజ్యాంగపరంగా లభించిన హక్కులనూ పొందలేని పరిస్ధితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ ముందుగా ఎస్సీలనే వంచించారంటూ మండిపడ్డారు. విజయవాడ వేదికగా జగన్ పాలనలో దళితులపై దాడులు- ప్రభుత్వ వైఫల్యాల అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం చేపట్టారు. తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

దళిత సంఘాల సదస్సు

తీవ్ర అన్యాయం.. జగన్ ప్రభుత్వంలో మాలలు, మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్​పీఎస్) నాయకుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎ జగన్ దళితులను వంచించాడని ఆయన ఆరోపించారు. జగన్ పాలనలో దళితులపై దాడులు అంశంపై విజయవాడలోని ఐలాపురం హోటల్​లో టీడీపీ ఆధ్వర్యాన నిర్వహించిన సదస్సులో మందకృష్ణ మాట్లాడారు. నాలుగేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో దళితులపై 8 వేల దాడులు జరిగాయని.. అభివృద్ధిలో ఎస్సీలు 25ఏళ్లు వెనక్కివెళ్లి పోయారని విచారం వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న దారుణాలు కలవరపెడుతున్నాయని, దళితులు కేసులు పెట్టినా పోలీసులు పట్టించుకోవడం లేదని మందకృష్ణ పేర్కొన్నారు. దళితులు హత్యకు గురవుతున్నా కేసులు నమోదు కావడం లేదని చెప్తూ.. దళితుల రక్షణ కోసమైనా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మళ్లించిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, నిధులు పక్కదారి పట్టించిన అధికారులపై అట్రాసిటీ కేసు పెట్టాలని అన్నారు. మాల, మాదిగ, రెల్లి వర్గాల మధ్య అసమానతలు లేకుండా చూడాలని కోరారు.

కచ్చితమైన ప్రకటనలు చేసేవారినే నమ్ముతాం.. చంద్రబాబుతో తనకున్న అనుబంధం కొద్దీ.. తాను నేను ఏం మాట్లాడినా టీడీపీ మనిషిని అనేవారని మందకృష్ణ తెలిపారు. ఎస్సీ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిపై చర్యలు లేవని అసహనం వ్యక్తం చేశారు. కచ్చితమైన ప్రకటన చేసే నేతలనే తాము నమ్ముతామని, ఎస్సీలపై దాడి చేస్తే తీవ్ర చర్యలుంటాయని చంద్రబాబు ప్రకటించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.

దాడులు వెలుగులోకి రావడం లేదు.. అంతకు ముందు దళిత సంఘాల నేతలు కొలికపూడి శ్రీనివాసరావు, కొరివి వినయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఎస్సీలపై జరుగుతున్న అనేక దాడులు వెలుగులోకి రావట్లేదని అన్నారు. ఈ నాలుగేళ్లల్లో ఏ రెడ్డి నాయకుడైనా హత్యకు గురయ్యాడా? అని ప్రశ్నించారు. పల్నాడు జిల్లాలో ఎస్సీ మహిళను దారుణంగా హత్య చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగేళ్లల్లో ఎస్సీలపై 8 వేలకు పైగా దాడులు జరిగాయని తెలిపారు. ఈ రాక్షస ప్రభుత్వంపై టీడీపీ నేతలు నిత్యం పోరాడుతున్నారని, వైఎస్సార్సీపీని ఓడించాల్సిన అవసరం ఎస్సీలకే ఎక్కువగా ఉందని అన్నారు. జగన్‌ ప్రభుత్వంలో మాలలు, మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఎస్సీలంతా ఏకం కానంత వరకు సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని జగన్‌ పాలన నుంచి విముక్తి చేయాల్సిన అవసరం ఎస్సీలకు ఉందని పేర్కొన్నారు.

రాజకీయ నిర్ణయాధికారంలో కీలకం కావాలి... రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు ఆగట్లేదని, ఆందోళన చేస్తే వెంటనే ఇంటికి పోలీసులు వస్తున్నారని కొరివి వినయ్‌ కుమార్‌ అన్నారు. ఇప్పటి వరకు 8 వేల ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు అయితే... సగం కూడా ఛార్జిషీట్లు దాఖలు చేయలేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను అత్యంత బలహీనులుగా మార్చిన ఈ ప్రభుత్వంపై ఉద్యమించాలని, ఛార్జిషీట్లు దాఖలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సీఎం జగన్‌ పరిపాలన వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని చెప్తూ.. రాజకీయ నిర్ణయాధికారంలో ఎస్సీలు కీలకంగా ఉండాలని అన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : May 21, 2023, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.