ఇదీ చూడండి:
ధర్నా చేస్తారనే దాడికి పాల్పడ్డారు: దేవినేని ఉమా - tdp leader devineni uma fires on ycp cadre in mylavaram
రాజధాని తరలింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తారనే ఉద్దేశంతోనే... కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నాకి చెందిన వైకాపా వర్గీయులు తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలు షేక్ సుభాని, దూరు బాలకృష్ణను ఆయన పరామర్శించారు. ఎప్పుడూ లేని విధంగా వేరే ప్రాంతం వారు వచ్చి దాడి చేశారంటూ మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మైలవరంలో తెదేపా కార్యకర్తలను పరామర్శించిన దేవినేని ఉమా
ఇదీ చూడండి:
sample description