ETV Bharat / state

ఏ మతంపై దాడి జరిగినా సహించం.. ముందుండి పోరాడతాం: చంద్రబాబు - ఎన్టీఆర్​కు చంద్రబాబు నివాళి

మత సామరస్యం తమ పార్టీ సిద్ధాంతమని, ఏ మతంపై దాడి జరిగినా ముందుండి పోరాడతామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేవాలయాలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడిన వారిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. మత విశ్వాసాలపై దాడి జరిగితే పోరాడకూడదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp-chief-chandrababu-pays-tribute-to-ntr
ఎన్టీఆర్​కు తెదేపా అధినేత చంద్రబాబు నివాళి
author img

By

Published : Jan 18, 2021, 3:06 PM IST

Updated : Jan 19, 2021, 6:21 AM IST

‘ప్రజాసేవకే రాజకీయం తప్ప, అణచివేతల కోసం కాదు. రౌడీయిజం, తప్పుడు కేసులు, వేధింపులతో అణగదొక్కడమే పనిగా వైకాపా పెట్టుకుంది. తెదేపా చాలా చైతన్యవంతమైన పార్టీ. మా అందరిలో ఎన్టీఆర్‌ స్ఫూర్తి ఉంది. భయం తెలియని, త్యాగాలకు వెనుదీయని పార్టీ మాది. ఖబడ్దార్‌.. మీ ఆటలు సాగవు. మీరు గాలికి వచ్చారు. గాలికే కొట్టుకుపోతారు’ అని ఆయన ధ్వజమెత్తారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి సందర్భంగా సోమవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు.

సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన విమానంలో గన్నవరం వచ్చారు. నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహంవద్ద చంద్రబాబు జ్యోతి వెలిగించి, పుష్పాంజలి ఘటించారు. ‘సంక్షేమ, ప్రజోపయోగ కార్యక్రమాలతో ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత దేశ చరిత్రలో ఆయనొక్కడిదే. పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం, శాశ్వత గృహ నిర్మాణ పథకం, పేదలకు చీర, ధోవతి, రైతులకు రూ.50కే విద్యుత్తు వంటివన్నీ ఆయన ప్రవేశపెట్టిన పథకాలే. రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలించారు. ఆడపిల్లలకు ఆస్తిలో సమానహక్కు కల్పించారు. బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి చాలా లేఖలు రాశాం. మహానాడులో తీర్మానించి పంపించాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కేంద్రం వెంటనే స్పందించి ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి. అప్పటి వరకు తెదేపా పోరాడుతుంది’ అని పేర్కొన్నారు.

సీసీటీవీ ఆధారాలుంటే బయటపెట్టండి
దేవాలయాలపై దాడుల్లో తెదేపా నాయకుల పాత్రపై సీసీటీవీ ఆధారాలుంటే బయటపెట్టాలని చంద్రబాబు డిమాండు చేశారు. ‘తెదేపా కార్యకర్తలు అధైర్యపడాల్సిన పనిలేదు. పార్టీని అంతం చేయాలని గతంలోనూ చాలా మంది పగటి కలలు కన్నారు. తెదేపా పునాదుల్ని కదిలించే శక్తి ఎవరికీ లేదు. ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే పార్టీ మరో 20-30 ఏళ్లపాటు బలంగా తయారవుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులకు పాల్పడితే సహించేది లేదు’ అని పేర్కొన్నారు.

రక్తదానం చేసిన అచ్చెన్నాయుడు
ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లెజండరీ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌లకూ విశేష స్పందన వచ్చిందని చంద్రబాబునాయుడు తెలిపారు.
రామరాజ్య స్థాపనే అసలైన నివాళి
‘తెలుగువారి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్‌ మనకు దూరమై 25 ఏళ్లయినా ఆ విశ్వవిఖ్యాతుడు మన కళ్లముందే కదలాడుతున్నట్లుగా ఉంది. తెలుగునాట రామరాజ్యాన్ని తిరిగి నెలకొల్పడమే ఎన్టీఆర్‌కు మనం అందించే అసలైన నివాళి’ అని చంద్రబాబు సోమవారం ట్వీట్‌ చేశారు. ‘మనిషి ఎదగడానికి పట్టుదల, కృషి ఉంటే చాలని ఎన్టీఆర్‌ నిరూపించారు. అరవై ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలతో, సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించారు’ లోకేశ్‌ ట్విటర్‌లో కొనియాడారు.
తెదేపా దూరదృష్టితోనే ఆ సంస్థలకు ప్రపంచ స్థాయి: చంద్రబాబు
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద చంద్రబాబు మాట్లాడుతూ.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు జినోమ్‌ వ్యాలీ పేరుతో పలు సంస్థలు ఏర్పాటుచేసిందని, ఆ దూరదృష్టి వల్లే భారత్‌ బయోటెక్‌ వంటి కంపెనీలు నేడు ప్రపంచం గర్వించే స్థాయికి చేరుకున్నాయని అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, నారా లోకేష్‌, దేవాన్ష్‌, తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి అంజలి ఘటించారు.
12 వేల యూనిట్ల రక్తం సేకరణ
తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎన్టీఆర్‌ 25వ వర్ధంతిని నిర్వహించామని పార్టీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో 12 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు పేర్కొంది.

ఎన్టీఆర్​కు తెదేపా అధినేత చంద్రబాబు నివాళి

ఇదీ చదవండి :

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన బాలకృష్ణ

Last Updated : Jan 19, 2021, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.