గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న నకిలీ పెస్టిసైడ్స్ దందాను కృష్ణా జిల్లా విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి నాలుగున్నర కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ పురుగుల మందులు ,రసాయన ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. సిన్ జెంటా ఆగ్రో కెమికల్ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఉన్న నకిలీ ఉత్పత్తులను ఓ ముఠా తయారు చేస్తోంది. గుంటూరు జిల్లా పెదకాకాని కేంద్రంగా ఈ అక్రమ వ్యాపారాన్ని వారు కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి. ఈనెల 26న విజయవాడలో భాజపా మూడో వర్చువల్ ర్యాలీ