నవరత్నాల అమలు , పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇప్పటికే తయారయ్యాయి. సీఎం జగన్ ఆమోదం అనంతరం వీటిని విడుదల చేస్తారు. నవరత్నాల పథకంలో పేర్కొ న్న అన్ని కార్యకర్మాలు క్షేత్రస్థాయి నుంచి అన్ని సక్రమంగా అమలవుతున్నాయా ? తదితర అంశాల్ని ఈ విభాగం పరిశీలిస్తుంది. నిధుల విడుదలతోపాటు ఇతరత్రా సమస్యలేమైనా ఉంటే సంబంధిత శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేలా చూస్తుంది. ఆర్టీజీఎస్, ప్రణాళిక శాఖల్లో ఏదో ఒక దానికి ఈఈ విభాగపు బాధ్యతలు అప్పగించనున్నారు.
ఇదీ చదవండి.