ETV Bharat / state

'ఇలాంటి వెర్రివాడా ఐదేళ్లు మనల్ని పాలించింది' - జగన్​పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - PCC CHIEF SHARMILA FIRE ON JAGAN

జగన్ రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు - ఏసీబీకి ఫిర్యాదు చేస్తామన్న షర్మిల

PCC Chief Sharmila Sensational Comments On Ys Jagan
PCC Chief Sharmila Sensational Comments On Ys Jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2024, 3:54 PM IST

PCC Chief Sharmila Sensational Comments On Ys Jagan : అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్‌పై ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గత ప్రభుత్వం చేసుకున్న సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. FBI ఛార్జ్‌షీట్‌లో తన పేరు లేదని జగన్ చెప్పడం ఆయన వెర్రితనమన్నారు. ఈ వెర్రివాడా ఐదేళ్లూ మనల్ని పాలించిందని ప్రజలు అనుకోగలగరంటూ షర్మిల ఎద్దేవా చేశారు. జగన్, అదానీ సెకీ ఒప్పందంపై షర్మిలా మాట్లాడుతూ "అదానీతో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. డీల్ రద్దు చేయడానికి బాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అదానీ వద్ద జగన్ రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై రేపు ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని షర్మిలా తెలిపారు.

ఈ అంశం అమెరికా కోర్టుల్లో కేసు నమోదు అయింది. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు లేవు. చంద్రబాబు అదానీ పేరు కూడా ఎత్తడం లేదు. జగన్ కి చంద్రబాబుకి ఏమిటి తేడా ? జగన్ రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు. నా పేరు లేదు అని జగన్ అతి తెలివిగా మాట్లాడాడు. నా పేరు ఎవరైనా చెప్పారా అంటున్నాడు. అప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే జగన్ కాదా ? మీది అతి తెలివినా? వెర్రితనమా? మీకు వెర్రి పట్టింది అని జనాలు అనుకుంటున్నారని షర్మిలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రేషన్​ మాఫియా జాతీయస్థాయి కుంభకోణం - హడావుడి కాదు, నిగ్గు తేల్చాలి : షర్మిల

ఇలాంటి వెర్రివాడా ఐదేళ్లు పాలించింది అని అనుకునే ప్రమాదం ఉంది. రాష్ట్రానికి 25 ఏళ్లు అదానీ పవర్ ఒక భారం. పక్క రాష్ట్రాల్లో రూ. 1.99 పైసలు అమ్ముతుంటే ఇక్కడ రూ.2.49 పైసలు ఎక్కువ పెట్టీ ఎందుకు కొన్నారు? రాష్ట్రంపై ప్రతి యూనిట్ కి 50 పైసలు అదనం. ఈ 50 పైసలు భారం ప్రజల మీద పడితే చంద్రబాబుకి ఓకేనా ? ట్రాన్స్​మిషన్ చార్జీలు లేవు అని జగన్ అంటున్నారు. కానీ విద్యుత్ శాఖ అధికారులు యూనిట్​కి 1.70 పైసలు దాకా పడే అవకాశం అంటున్నారు. దీనిపై చంద్రబాబు ఎటువంటి విచారణ చేస్తున్నారు? ట్రాన్స్మిషన్ చార్జీలు ఉన్నాయా ? లేదా ? చెప్పాల్సిన భాధ్యత చంద్రబాబు పై ఉందని షర్మిల అన్నారు.

ప్రతి ఏడాది సోలార్ పవర్ చార్జీలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు 10 రూపాయలు ఉండే యూనిట్ ధర ఇప్పుడు 1.99 పైసలు వచ్చింది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. చార్జీలు తగ్గుతూంటే జగన్ 25 ఏళ్లకు ఎందుకు MOU చేశారు. జగన్ అధికారంలో వచ్చాకా చంద్రబాబు చేసిన ఒప్పందాలు రద్దు చేశారు. లాంగ్ టర్మ్ ఒప్పందాలు ఉండకూడదు అన్నారు. మరీ జగన్ ఎందుకు 25 ఏళ్లకు అదానీ తో ఒప్పందం చేసుకున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీ డీల్ పెద్ద కుంభకోణం అని ఆందోళన చేసింది. కోర్టులో కూడా కేసులు వేసింది. పెద్ద ఎత్తున ముడుపులు అందాయని పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశాడని గుర్తు చేశారు.

జగన్​ను ఆస్కార్​కు నామినేట్ చేసిన షర్మిల - బైబిల్‌పై ప్రమాణం చేయాలని సవాల్

మరి మీరు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. ఈ విషయంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని ఎందుకు మౌనంగా ఉన్నారు ? మీరు జగన్ చేసిన డీల్స్ రద్దు చేయలేదు అంటే అవి సక్రమం అని ఒప్పుకుంటారా ? లేక అదానీ కి చంద్రబాబు బయపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం నెత్తిన విద్యుత్ సర్దుబాటు చార్జీలు మోపారు. రూ. 17500 కోట్లు ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు. ఈ డీల్ పై చంద్రబాబు మౌనం వహిస్తే ప్రజలు క్షమించరు. వెంటనే డీల్ ను క్యాన్సల్ చేయండి. అదానీ తో చేసుకున్న ఒప్పందాలపై పరిశీలన చేయాలని సెంట్రల్ ERC కి లేఖ రాస్తున్నాం. ఈ డీల్ పై పరిశీలన చేయాలని షర్మిలా కోరారు.

బొత్స నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు. పచ్చ కామెర్లు కమ్మినోనికి లోకం అంతా పచ్చగా ఉంటుంది అంట. బొత్స తీరు కూడా ఇలానే ఉంది. నాతో వాళ్లకు పర్సనల్ ఇష్యూ లు ఉన్నాయని అనేది వాళ్ల భావన. అందుకే నేను మాట్లాడేది కూడా పర్సనల్ అనుకుంటున్నారు. నేను జగన్ అవినీతి, నిర్లక్ష్యాన్ని మాత్రమే ప్రశ్నించా, నిజంగా పర్సనల్ విషయాలు మాట్లాడితే జగన్ అడుగుకూడా బయట పెట్టలేడని షర్మిలా వ్యాఖ్యానించారు.

గవర్నర్​ను కలిసిన వైఎస్​ షర్మిల - ఎందుకంటే

మధ్య నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్మారు. ఇది మాట్లాడితే పర్సనల్ అవుతుందా? ధర స్థిరీకరణ నిది ఎక్కడ అని అడిగితే పర్సనల్ అవుతుందా ? రూ.1750 కోట్ల ముడుపులు అడిగితే పర్సనల్ అవుతుందా ? వివేకా హత్య మీద మాట్లాడితే పర్సనల్ ఎలా అవుతుంది. గంగవరం పోర్టు అమ్మేశారు అంటే పర్సనల్ అవుతుందా ? సోషల్ మీడియా లో సైతాన్ సైన్యం గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా ? ఇది సోషల్ ఇష్యూ అని నేను అంటే పర్సనల్ అవుతుందా ? ఏది పర్సనల్, వైఎస్సార్సీపీ నేతలు సమాధానం చెప్పాలి. జగన్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. నేను ఏపీసీసీ అధ్యక్షురాలు అని నాకు గుర్తుంది. అందరి వైఫల్యాలను ఎత్తి చూపడం నా విధి. ఇది కూడా పర్సనల్ అని అంటే ఎలా ? సెకీ ఒప్పందాలపై మేము వితండవాదం చేయాల్సిన అవసరం లేదు. తప్పు మీరు చేశారు అందుకే బయపడుతున్నారని షర్మిలా ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఒక కాకినాడ పోర్టునే కాదు అన్ని పోర్టులను రాయించుకున్నారు. కృష్ణపట్నం పోర్టును బలవంతంగా రాయించారు. గంగవరం పోర్టు ను పూర్తిగా అమ్మేశారు. సెకి ఒప్పందాల పై ACB కి పిర్యాదు చేస్తాం. కాంగ్రెస్ లో ఏ సీనియర్ నాయకుడు నిరుత్సాహంగా లేడు. ఎవరినైనా బయటకు వచ్చారా? ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. సీనియర్లు అందరు కలసి ఉన్నారు. పదవులు పోయిన వాళ్లు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ల ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని" వైఎస్ షర్మిల అన్నారు.

రాజ్యాంగమంటే గౌరవం లేదు - వారంతా రాజీనామా చేయాలి: షర్మిల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.