High Court Verdict On Illegal Constructions at Bheemunipatnam Beach: భీమునిపట్నం బీచ్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిగింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి భీమునిపట్నం బీచ్ వద్ద సీఆర్‌జడ్ నిబంధనలకు విరుద్ధంగా శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
ఈ విచారణ సందర్భంగా గతంలో విశాఖ కలెక్టర్, GVMC కమిషనర్, సీఆర్‌జడ్ అధికారులతో వేసిన కమిటీ అక్రమ నిర్మాణాలపై కోర్టుకు తమ నివేదిక సమర్పించింది. హైకోర్టు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి రూపొందించిన నివేదికను కమిటీ కోర్టుకు అందజేసింది. ఈ నివేదికను పరిశీలించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
భీమిలి తీరంలో వైసీపీ నేత అక్రమ నిర్మాణాలు - కుమార్తె పేరుతో స్టార్ హోటల్ !