ETV Bharat / state

పాఠశాలల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు - sankranthi celebrations news

పాఠశాల, కళాశాలల్లో ముందస్తు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రాభరణాలు, రంగవళ్లులు, భోగిమంటలు, విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. పిల్లలకు పండుగ విశిష్టతపై అవగాహన కల్పించేందుకే ముందస్తు వేడుకలు నిర్వహించినట్లు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తెలిపాయి.

sankranthi celebrations
పల్లె సంప్రదాయం ఉట్టిపడేలా...ముందస్తు సంక్రాంతి వేడుకలు
author img

By

Published : Jan 11, 2020, 11:29 PM IST

తిరువూరు శ్రీనిధి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు
గుడివాడ కళాశాలలో సంక్రాంతి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. కృష్ణా జిల్లా తిరువూరు శ్రీనిధి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు సంక్రాంతి శోభను ప్రతిబింబించాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గుడివాడ ఇంజినీరింగ్​ కళాశాలలోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.

పశ్చిమగోదావరి జిల్లా

తణుకులోని మాంటిస్సోరి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులు, పిండివంటల ఘుమఘుమలతో సంక్రాంతి శోభ ముందుగానే ప్రతిబింబించింది. మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్​లో శ్రీ గౌతమి విద్యా సంస్థలు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.

గుంటూరు జిల్లా

చిలకలూరిపేట పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు

చిలకలూరిపేటలో పలు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి పాటలకు నృత్యాలతో అలరించారు. రామదాసు భజనలు, హరిదాసు కీర్తనలు దేవతా మూర్తుల వేషధారణలతో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది.

నెల్లూరు జిల్లా

పాఠశాలల్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరం

నాయుడుపేట నవోదయ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా.. సంక్రాంతి సంబరాలు

Intro:ap_vja_41_11_sankranthi_sambaraalu_tiruvur_av_ap10125

కృష్ణాజిల్లా తిరువూరు శ్రీనిధి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి విద్యార్థులకు సాంప్రదాయ పిండి వంటలు రంగవల్లులు సంప్రదాయ వస్త్రధారణ వాలు జడ వంటి పోటీలు నిర్వహించారు భోగి మంటల చుట్టూ జానపద గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి చిన్నారులపై భోగి పళ్ళు పోసి ఇ ఆశీస్సులు అందించారు గ్రామీణ వాతావరణం అద్దంపట్టేలా రైతు వేషధారణలతో హాజరైన విద్యార్థులు ధాన్యం తూర్పారబట్టారు చెరుకు గడల మధ్య పొయ్యి ఏర్పాటు చేసి పొంగలి తయారు చేశారు సంక్రాంతి పర్వదినాన్ని కి అద్దం పడుతూ పాఠశాల ఆవరణలో రంగవల్లులతో తీర్చిదిద్దారు ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు కరస్పాండెంట్ ముత్యాల కిషోర్బాబు ప్రిన్సిపల్ వెంకట్ నారాయణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Body:అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709,8500544088
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.