కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం దొనబండ క్వారీల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన క్వారీకి మైనింగ్ గనుల శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు పరిటాల గ్రామంలో ప్రజాభిప్రాయం సేకరించారు. బొల్లారెడ్డి విమలా రెడ్డి రోడ్డు మెటల్ గ్రావెల్ క్వారీకి సంబంధించి పరిటాల గ్రామంలోని సర్వే నెంబర్ 801లో 15 హెక్టార్లకు సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం మైనింగ్ అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. కాలుష్య నియంత్రణ శాఖ ద్వారా పరిటాల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు.
'నష్టాలను వివరించారు'
బ్లాస్టింగ్ చేసే సమయంలో సైరెన్ మోగడం సహా తదితర అంశాలను గ్రామస్థుల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ప్రజాభిప్రాయ సేకరణలో జరిగే నష్టాలను స్థానికులు వివరించారని డీఆర్వో వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ అంశాలను జిల్లా కలెక్టర్ సహా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ధర్మపోరాటంలో తెదేపా కార్యకర్తలే నా సైన్యం: చంద్రబాబు