Bharat Jodo Yatra in Hyderabad: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ హైదరాబాద్ కొనసాగుతోంది. నేడు శంషాబాద్ మాతా ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర జీహెచ్ఎంసీ పరిధిలోకి ప్రవేశించి గగన్‌పహాడ్‌కు చేరుకొని, అక్కడి నుంచి ఏజీ కాలేజ్ మీదగా ఆరామ్ఘర్వైపు సాగింది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ పాల్గొన్నారు.
Bharat Jodo Yatra in Telangana : హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్రకు ఘన స్వాగతం పలుకుతూ నగరవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్లెక్సీలు, జెండాలను ఏర్పాటు చేశారు. చార్మినార్ నుంచి మోజాంజాహీ మార్కెట్, గాంధీభవన్, రవీంద్రభారతి, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాందీ విగ్రహం వరకు రాహుల్ గాంధీకి భారీ ఫ్లెక్సీలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.
తాడ్ బన్ లెగెసి ప్యాలెస్ చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడే ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం వరకు ప్యాలెస్‌లోనే విశ్రాంతి తీసుకోనున్నారు. తరవాత సాయంత్రం 4 గంటలకు పురాణాపూల్ నుంచి పాదయాత్రను మళ్లీ మొదలు పెట్టనున్నారు. ఆ తర్వాత పాదయాత్రను కొనసాగిస్తూ చార్మినార్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
రాత్రి 7 గంటలకు నెక్లెస్ రోడ్డుకు చేరుకోనున్న రాహుల్.. అక్కడ జరగనున్న కార్నర్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. రాత్రి బోయిన్‌పల్లిలోని గాంధీ భావజాల కేంద్రంలో విశ్రాంతి రాహుల్ తీసుకోనున్నారు. ఇవాళ రాహుల్‌గాంధీ యాత్రలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనున్నారు. భారత్ జోడో యాత్ర దృష్ట్యా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటలు నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత: నిన్న జరిగిన సంఘటనతో రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్రకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్న పాలమాకులలో గుర్తు తెలియని వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించుకొని రాహుల్ వద్దకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నేటి నుంచి భద్రతను కట్టుదిట్టం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ బలగాలు ఆ వ్యక్తిని బయటకు పంపించాయి. నిన్నటి ఈ ఘటనపై అధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. రాత్రి సీఆర్పీఎఫ్ బలగాలతో రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. నిన్నటి వరకు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భద్రతగా 600 మంది పోలీసులు ఉన్నారు. తాజా సంఘటనతో నేటి నుంచి ఆ భద్రతా సిబ్బంది సంఖ్యను 1000కి పెంచారు. పాదయాత్రకు కిలోమీటర్ ముందు వరకు ఎటువంటి వాహనాలు అడ్డు లేకుండా పోలీసులు తొలగిస్తున్నారు.
ఇవీ చదవండి: