సెల్ఫోన్లో పురోహితుడు వేద మంత్రాలు చదవగా.. వధూవరులు ఒక్కటైన సంఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం అంబ్రియా పంచాయతీ పరిధి సొమ్ల తండాకు చెందిన బానోత్ శివరాం కూతురు మంజులకు.. టేక్మాల్ మండలం భీమ్లా తండాకు చెందిన పాత్లోథ్ మోహన్‌తో వివాహం నిశ్చయమైంది. పెళ్లి సోమవారం జరగాల్సి ఉండగా.. అంతకు ముందు రోజున వధువు తండాలో ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు.
కరోనా కలకలం..
తండాకు వెళ్లి పెళ్లి చేసేందుకు భయపడిన పురోహితుడు.. తన నివాసం నుంచే పెళ్లి జరిపించాడు. వీడియో కాల్లో పంతులు వేద మంత్రాలు జపించగా.. మొబైల్‌ను మైకు వద్ద పెట్టి అందరికీ వినిపించేలా చేశారు. చరవాణీలో చూస్తూ.. పురోహితుడు చెప్పిన విధంగా ఆ నూతన వధూవరులు సంప్రదాయాన్ని పాటించారు. మొత్తానికి మొబైల్ వీడియో కాల్‌తో.. పెళ్లి తంతు ముగించారు. ఒక్కటైన కొత్త జంటను ఆన్లైన్లోనే ఆశీర్వాదించాడు ఆ పురోహితుడు. ఇప్పుడు ఈ పెళ్లి విషయం.. జిల్లా అంతటా "ఆన్లైన్ పెళ్లి" పేరిట వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి: