కృష్ణా జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. కంకిపాడు - గుడివాడ రహదారి మీదుగా పవన్‌కల్యాణ్ ర్యాలీ జరిగింది. మార్గమధ్యలో రైతులను కలుస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. తుపాను వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించారు. అంగులూరులో పొలాల్లో దిగి నష్టపోయిన రైతుల కష్టాలు పవన్ కల్యాణ్ విన్నారు.
నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం పెంచాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. పంటనష్టం పరిహారం పెంచాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. నందమూరు క్రాస్ రోడ్డు వద్ద మహిళలు పవన్‌కు హారతులు పట్టారు. రైతన్నలు తమ కష్టాలను పవన్ కు వివరించారు. పంటనష్టానికి పరిహారం పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరారు.
ఇదీ చదవండి: