కృష్ణాజిల్లాకు చెందిన జాన్ వజ్రం అనే మహిళ గత 20 ఏళ్లుగా నందిగామలో నివాసముంటున్నారు. ఉన్నట్టుండి టౌన్ ప్లానింగ్ అధికారి రాబర్ట్ వచ్చి ఇంటికి ప్లానింగ్ అర్హత లేదని.. సాయంత్రంలోగా 50 వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎదురుతిరిగిన జాన్ వజ్రంపై తీవ్ర పదజాలంతో దూషించారు. ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు మహిళ పోలీసులను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి కేంద్ర ప్రతినిధులకు సీసీఎల్ఏలో శిక్షణ