విజయవాడలోని కొత్తపేటలో దారుణం జరిగింది. చనమోలు వెంకట్రావు ఫ్లై ఓవర్పై జరిగిన హత్య కలకలం సృష్టించింది. రౌడీషీటర్ కిలారి సురేష్ అలియాస్ బుగ్గలోడు అనే వ్యక్తిని కత్తులతో దాడి చేసి చంపేశారు. ఆటోడ్రైవర్లతో వివాదమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుడిపై గతంలో గంజాయికి సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయని తెలిపారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి..రైల్వే బ్రిడ్జ్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్యాయత్నం