నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో వానరాల ఆగడాలు పెరిగిపోయాయి. గుంపులు గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నాయి. నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బందిని కోతులు హడలెత్తిస్తున్నాయి. క్యాంపస్ ఆవరణలో చేరి గందరగోళం సృష్టిస్తున్నాయి. కోతులు ఒక్కసారిగా విద్యార్థులపై దాడి చేయగా.. వారిని సెక్యూరిటీ సిబ్బంది రక్షించారు. అయితే ఈ దాడిలో సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి కాపాడాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: