రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వివరించారు. కృష్ణాజిల్లా పెనమలూరు మార్కెట్ యార్డులో... రైస్ మిల్లర్లు, రైతులు, అధికారులతో ఆయన మాట్లాడారు. ధరల స్థిరీకరణ, పంటకు గిట్టుబాటు ధరపై చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇవీ చూడండి...మహిళను కాపాడిన అర్జునరావుకు సీఎం అభినందనలు