ETV Bharat / state

గొంతులో ఆమ్లెట్​ ఇరుక్కుని వ్యక్తి మృతి.. - ఏపీ ప్రధాన వార్తలు

Man Dies After Omelet Stuck in Throat: గొంతులో ఆమ్లెట్​ ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా, జరిగిన తతంగం వింటే.. మీరు కూడా ముక్కుమీద వేలేసుకుంటారు. తెలంగాణ జనగామ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై.. పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో ఏం తేలుతుందోనని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

man dies after omelet stuck in throat
గొంతులో ఆమ్లెట్​ ఇరుక్కుని వ్యక్తి మృతి
author img

By

Published : Nov 4, 2022, 2:24 PM IST

Man Dies After Omelet Stuck in Throat: మద్యం తాగేందుకని ఓ వ్యక్తి వైన్​ షాపుకెళ్లాడు. తనకు నచ్చిన బ్రాండు అడిగాడు. ఇచ్చిన బాటిల్​ తీసుకుని పక్కనే ఉన్న పర్మిట్​ రూమ్ ​(మద్యం తాగేందుకు అనుమతి గది)లోకి వెళ్లాడు. ఖాళీగా ఉన్న ఓ టేబుల్​ చూసుకుని కూర్చున్నాడు. బాటిల్​ ఓపెన్​ చేసి.. ఓ పెగ్గు కలిపాడు. అప్పుడు గుర్తొచ్చింది మనోడికి మంచింగ్​ సంగతి. మందు ఓకే.. మరి మంచింగ్​ ఏం తీసుకుందాం అని కాసేపు ఆలోచిస్తే.. అసలే చలిగా ఉంది కదాని వేడివేడిగా ఏదైనా ఉంటే బాగుంటుందని అనిపించింది అతగాడికి. మరీ కాస్ట్​లీవి మనకెందుకు.. ఓ ఆమ్లెట్​తో సరిపెట్టేద్దాంలే​ అనుకుని.. ఆర్డర్​ ఇచ్చాడు. వేడివేడిగా ఆమ్లెట్​ టేబుల్​పైకి వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని ఓ పెగ్గేశాడు. వేడివేడి ఆమ్లెట్​ను​ తీసుకుని అలా నోట్లో పెట్టుకున్నాడు. అంతే.. అదే ఆమ్లెట్​ యమపాశమై మనోడి ప్రాణాలను తీసేసింది.

తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేటలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం సేవించాడు. తాను తింటున్న ఆమ్లెట్‌ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.