ముఖ్యమంత్రి జగన్పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. రూపాయి జీతం మాత్రమే తీసుకుంటున్నాఅని చెప్పుకుంటున్న సీఎం... తన ఇంటి ముస్తాబులకు 5 నెలల్లో సుమారు రూ.16 కోట్లు ప్రజా ధనం ఎలా ఖర్చు చేశారో చెప్పగలరా.. అని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని విమర్శించారు. విష జ్వరాలతో ప్రజలు చనిపోయినా దోమల నివారణకు ప్రజాధనం వృధా చెయ్యం అని వైకాపా నేతలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ మేరకు ముఖ్యమంత్రి నివాసానికి ఖర్చు చేసిన నిధుల విడుదల జీవోలను లోకేశ్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ, అహంకార పోకడలతో రిలయన్స్, అదానీ వంటి ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఒకదాని వెంట ఒకటి రాష్ట్రం విడిచిపోతున్నాయని లోకేశ్ అన్నారు. ఆ సంస్థల వెంటపడి, ఒప్పించి ఏపీకి తేవడానికి తాము పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
విశిష్ట వ్యక్తులకు 11 విభాగాల్లో వైఎస్ఆర్ అవార్డుల ప్రదానం