Benefits of Gunjilu : బడిలో పిల్లలు ఏమైనా తప్పులు చేసినా, హోం వర్కు కంప్లీట్ చేయకపోయినా టీచర్లు గుంజిళ్ల శిక్ష విధించేవారు. ఇలా గుంజిళ్లు తీస్తున్నప్పుడు కాళ్లు నొప్పి పుడతాయి. ఈ శిక్ష వల్ల విద్యార్థులు బుద్ధిగా చదువుకుంటారని మాష్టార్లు భావించేవారు. అయితే, ఈ గుంజిళ్లతో క్రమశిక్షణ మాత్రమే కాకుండా, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని తాజా పరిశోధన చెబుతోంది. ఇదొక చక్కటి వ్యాయామంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. మరి, గుంజిళ్ల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మన దగ్గర పాఠశాలల్లో శిక్షగా తీయించిన గుంజీళ్లను ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో 'సూపర్ బ్రెయిన్ యోగా'గా భావిస్తున్నారు. గుంజిళ్లు తీయడం ఒక వ్యాయామంగా సాధన చేయిస్తున్నారు.పిల్లల్లో ఏకాగ్రత పెరిగేందుకు గుంజిళ్లు తీయడం ఒక చక్కటి వ్యాయామని నిపుణులు చెబుతున్నారు.
కుడిచేత్తో ఎడమ చెవినీ, ఎడమచేత్తో కుడిచెవినీ పట్టుకుని పైకి లేస్తూ కింద కూర్చుంటూ చేసే ఈ ఎక్సర్సైజ్ వల్ల మెదడులోని కొన్ని భాగాలు చైతన్యం అవుతాయట. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుందని అంటున్నారు. అలాగే మతిమరుపు కూడా తగ్గుతుందట. గుంజిళ్లు తీయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని National Institutes of Health (NIH) నిపుణుల బృందం వెల్లడించింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
సూపర్ బ్రెయిన్ యోగా (గుంజిళ్లు) వల్ల కలిగే ప్రయోజనాలు :
- గుంజిళ్లు తీయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల రోజంతా చురుకుగా ఉంటారు.
- కొంతమంది విద్యార్థులు పుస్తకం తెరిచి 10 నిమిషాలు కూడా చదవకుండానే ఫోన్ చూడడం, టీవీకి అతుక్కుపోవడం చేస్తుంటారు. ఇలాంటి వారి మనసు చేసే పనిపై ఉండకుండా ఇతర పనులవైపు మళ్లుతుంది. అలాంటి వారు రోజు కొన్ని గుంజిళ్లు తీయడం వల్ల మనసు ఒకేచోట కేంద్రీకరించుకోవచ్చు.
- గుంజిళ్లు తీయడం వల్ల ఒత్తిడి తగ్గిపోయి మనసు ప్రశాంతంగా మారుతుందట.
- ఈ సూపర్ బ్రెయిన్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల క్రియేటివ్‌గా ఆలోచిస్తారట.
- గుంజిళ్లు తీయడం వల్ల కాళ్లు, తొడల భాగాలు బలంగా మారతాయి.
- గుంజిళ్లు తీయడం వల్ల చక్కగా నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మంచినీళ్లు తాగితే తలనొప్పి తగ్గుతుందట! - పరిశోధనలో కీలక విషయాలు!