Rain Alert to Andhra Pradesh : రాష్ట్రానికి వరుణగండం వీడటం లేదు. తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, వాయవ్య భారతం నుంచి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే రెండు రోజులు రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు అవకాశముందని తెలిపింది.