ETV Bharat / state

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​కు ఐఎస్​వో గుర్తింపు - vijayawada cyber crime police station news

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​కు ఐఎస్​వో గుర్తింపు లభించింది. ఉత్తమ ప్రమాణాలు పాటించటంతో ఐఎస్​వో సంస్థ 9001-2015 స్థాయి గుర్తింపు ఇచ్చిందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

iso certificate is given to vijayawada cyber crime police station
విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​కు ఐఎస్​వో గుర్తింపు
author img

By

Published : Feb 19, 2020, 5:39 AM IST

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​కు ప్రతిష్టాత్మకమైన ఐఎస్​వో గుర్తింపు లభించింది. 2018లో ప్రారంభమైన ఈ పోలీస్ స్టేషన్... ఉత్తమ ప్రమాణాలు పాటించటంతో ఐఎస్​వో సంస్థ 9001-2015 స్థాయి గుర్తింపు ఇచ్చిందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. డిజిటల్ రికార్డ్స్ , కేసులను త్వరగా పరిష్కరించటం, అత్యాధునిక పరికరాలు వినియోగించటం, కేసు నమోదు కాకుముందే బాధితులకు న్యాయం చేస్తున్న తీరును పరిశీలించిన అధికారులు గుర్తింపునిచ్చారన్నారు. మూడేళ్ల పాటు ఈ గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రతి ఏడాది పోలీస్ స్టేషన్ పనితీరును ఐఎస్​వో సంస్థ పరిశీలించి... ప్రమాణాలు తగ్గాయని భావిస్తే గుర్తింపు రద్దు చేసే అవకాశాలున్నాయని సీపీ అన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది సైబర్ క్రైమ్ కేసులను అధికంగా ఛేదించామని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​కు ఐఎస్​వో గుర్తింపు

ఇదీ చదవండి: ఉయ్యూరు చోరీ కేసును ఛేదించిన పోలీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.