కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైకాపాలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే వంశీ, పార్టీ నేత దుట్టా రామచంద్రరావు వర్గాల మధ్య చిన్నఅవుటపల్లిలో ఘర్షణ జరిగింది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తున్న తమను ఎమ్మెల్యే వర్గీయులు దూషించారని దుట్టా వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ వివాదం కాస్త ఆత్కూరు పోలీస్ స్టేషన్కు చేరుకుంది. ఇరువర్గాల వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎలాంటి ఘర్షణ జరగకుండా అవుటపల్లి గ్రామంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి