కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గుట్కా ప్యాకెట్లు భారీగా పట్టుబడ్డాయి. మచిలీపట్నంలో గుట్కా రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు డీఎస్పీ మెహబూబ్ బాషా తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పట్టణంలోని మూడు స్తంభాల సెంటర్లో పోలిశెట్టి నారాయణ అనే వ్యక్తి నుంచి గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నామని చెప్పారు. అనంతరం నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ముస్తఖాన్ పేటలోని ఘంటసాల పూర్ణ చంద్రరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.2.25 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఇదీ చూడండి: బిస్కెట్ల దుకాణంలో గుట్కా పంపిణీ.. నిర్వాహకుడి అరెస్టు