గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో గుట్కా అమ్మకాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ తెల్లవారుఝామున ఓ దుకాణంపై దాడి చేశారు. బొలిశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి పట్టణంలోని పదో వార్డులో ఓ పెంకుటిల్లును అద్దెకు తీసుకొని బిస్కెట్స్ దుకాణం నడుపుతుండగా... అదే దుకాణంలో నిషేధిత గుట్కా, ఖైని ప్యాకెట్స్‌ను భారీ స్థాయిలో అమ్ముతున్నట్టు గుర్తించారు. సుమారు 60 వేల రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇవి ఎక్కడ నుంచి వస్తున్నాయో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. ఎవరైనా పట్టణంలో గుట్కా అమ్ముతూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
ఇవీ చదవండి