ETV Bharat / state

సంక్షోభంలోనూ జీఎస్టీ వసూళ్లలో స్వల్ప వృద్ధి - ఏపీలో జీఎస్టీ వసూళ్లు వార్తలు

కరోనా ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయంలో స్వల్ప వృద్ధి నమోదైంది. గత ఏడాది జులైతో పోలిస్తే ఈ సారి జీఎస్టీ వసూళ్లు 35 కోట్ల రూపాయలు అదనంగా పెరిగాయి. మొత్తంగా ఈ ఏడాది జులైలో జీఎస్టీ ఆదాయం 1998.12 కోట్లు వసూలైందని వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేస్తోంది.

gst
gst
author img

By

Published : Sep 16, 2020, 4:37 PM IST

రాష్ట్రంలో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ద్వారా వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈసారి వృద్ధి నమోదు అయినట్టు వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేస్తోంది. దేశవ్యాప్తంగా జులై నెలలో వస్తు సేవల పన్ను ఆదాయం తగ్గినప్పటికీ... ఏపీలో మాత్రం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని జులై నెలలో గతేడాది కంటే 35.35 కోట్ల రూపాయలు అదనంగా వసూలైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది జులైలో మొత్తంగా 1,998.12 కోట్ల మేర జీఎస్టీ ఆదాయం వస్తే... గత ఏడాది ఇదే కాలానికి 1,962.77 మేర మాత్రమే వసూలు అయినట్టు వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే జులైలో జీఎస్టీ ఆదాయం 14.36 శాతం మేర తగ్గాయి. కరోనా ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటున్న దశలో వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆహార పదార్ధాల వినియోగం పెరగటంతో జీఎస్టీ వసూళ్లు పెరిగినట్టు వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేస్తోంది.

అప్పుడలా... ఇప్పుడిలా!
వాస్తవానికి లాక్‌డౌన్‌ సమయంలో 75 శాతం మేర జీఎస్టీ ఆదాయం కోల్పోయిన వాణిజ్య పన్నుల శాఖకు... ఏప్రిల్‌ నుంచి జులై వరకు నాలుగు నెలల్లో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేర వసూళ్లు తగ్గాయి. ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం రూ.5,508.49 కోట్లు వస్తే...గతేడాది ఇదే కాలానికి రూ.7,345.69 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. ప్రస్తుతం రీస్టార్ట్ పథకం అమలు అనంతరం ఏపీలో పెట్రోల్, డీజిల్ విక్రయాల్లోనూ వృద్ధి నమోదు అవుతోందని వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేస్తోంది. జులై నెలలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.852.97 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ రూపంలో రూ.2,713 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయానికి ఈ ఆదాయం రూ.3,521 కోట్ల మేర ఉన్నట్టు వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.