ETV Bharat / business

సేఫ్టీ మీ ఫస్ట్ ప్రయారిటీనా? 5-స్టార్ రేటింగ్​ ఉన్న ఈ టాప్​-5 కార్స్​పై ఓ లుక్కేయండి! - GLOBAL NCAP 5 STAR RATING CARS

గ్లోబల్‌ ఎన్‌సీఏపీ 5-స్టార్‌ రేటింగ్ పొందిన ఇండియాలోని టాప్‌-5 కార్స్‌ ఇవే!

Family Cars
Family Cars (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2024, 3:04 PM IST

Global NCAP 5 Star Rating Cars : దేశంలో రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వెహికల్ సేఫ్టీ అనేది కీలకంగా మారింది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లను రూపొందిస్తున్నాయి. వాటిలో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ పొందిన టాప్-5 ఇండియన్ కార్ల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

1. Tata Nexon : పెద్దలు, చిన్నపిల్లలు అందరూ సురక్షితంగా ప్రయాణించడానికి టాటా నెక్సాన్‌ కార్‌ చాలా బాగుంటుంది. అందుకే గ్లోబల్‌ ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌లో ఇది 5-స్టార్‌ రేటింగ్ పొందింది. టాటా నెక్సాన్​ అడల్ట్​ ఆక్యుపెన్సీ​ టెస్ట్​లో 32.22 పాయింట్లు, చైల్డ్ అక్యుపెన్సీ టెస్ట్‌లో 44.52 పాయింట్లు సాధించి 5-స్టార్​ రేటింగ్​ను పొందింది. వాస్తవానికి 2018 సేఫర్ కార్స్‌ ఇండియా ఇనీషియోటివ్‌లో భాగంగా 5-స్టార్ రేటింగ్ సాధించిన తొలి మోడల్‌గా టాటా నెక్సాన్ నిలిచింది.

Tata Nexon Standard Safety Features :

  • 6 ఎయిర్‌బ్యాగ్స్‌ (డ్యూయెల్ ఫ్రంట్‌, కర్టెన్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, సైడ్ ఎయిర్‌బ్యాగ్స్‌)
  • ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ఈఎస్‌సీ)
  • ISOFIX యాంకరేజెస్‌
  • సీట్‌ బెల్ట్ రిమైండర్‌
  • రివర్స్ పార్కింగ్ సెన్సార్స్‌
  • సెంట్రల్ లాకింగ్‌
  • టైర్ ప్రెజర్ మోనిటర్‌
  • 360 డిగ్రీ కెమెరా
  • బ్లైండ్‌-వ్యూ మోనిటర్‌
  • ఫ్రంట్‌ పార్కింగ్ సెన్సార్స్‌
  • రియర్‌వ్యూ కెమెరా

Tata Nexon Price : మార్కెట్లో ఈ టాటా నెక్సాన్ కారు ధర సుమారుగా రూ.8 లక్షలు - రూ.15.80 లక్షలు (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

2. Kia Carens : ఈ కియా కెరెన్స్ కారుకు ఈ ఏడాదిలో రెండుసార్లు జీఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌ నిర్వహించారు. మొదటిసారి చేసిన టెస్ట్‌లో అడల్డ్ ఆక్యుపెన్సీకి '0' రేటింగ్‌, చైల్డ్ ఆక్యుపెన్సీకి 4-స్టార్ రేటింగ్ వచ్చింది. దీనితో కియా కంపెనీ ఈ ఎంపీవీ కారులో పలు సేఫ్టీ ఫీచర్లను జోడించింది. దీనితో రెండోసారి చేసిన టెస్ట్‌లో ఈ కారు అడల్డ్ ఆక్యుపెన్సీలో 3-స్టార్‌ రేటింగ్‌, చైల్డ్ ఆక్యుపెన్సీకి 5-స్టార్ రేటింగ్ సంపాదించింది.

Kia Carens Safety Features :

  • 6 ఎయిర్‌బ్యాగ్స్‌
  • ISOFIX చైల్డ్ సీట్‌ యాంకరేజెస్‌
  • ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌
  • వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌
  • ఏబీఎస్‌ విత్‌ ఈబీడీ,
  • హిల్‌ అసిస్ట్ కంట్రోల్‌
  • డౌన్‌హిల్‌ బ్రేక్ కంట్రోల్‌

Kia Carens Price : మార్కెట్లో ఈ కియా కరెన్స్‌ కారు ధర సుమారుగా రూ.10.52 లక్షలు - రూ.19.94 లక్షలు (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

3. Tata Safari : టాటా కార్స్ అంటేనే సేఫ్టీకి మారుపేరుగా చెప్పుకుంటారు. ఈ ఏడాది టాటా సఫారీ గ్లోబల్‌ ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్ పొందింది. ఈ కారులో అటానమస్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ (ఏఈబీ), స్పీడ్ అసిస్టెన్స్‌ అండ్ బ్లైండ్‌ స్పాట్ డిటెక్షన్‌ (బీఎస్‌డీ) లాంటి సేఫ్టీ సిస్టమ్స్ ఉన్నాయి. కుటుంబ భద్రతే ముఖ్యం అనుకునేవాళ్లకు ఈ టాటా సఫారీ కారు బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

Tata Safari Safety Features :

  • 7 ఎయిర్‌బ్యాగ్స్‌ (ఫ్రంట్ డ్యూయెల్‌, డ్రైవర్ నీ, సైడ్ కర్టెన్‌, సైడ్ చెస్ట్ ఎయిర్‌బ్యాగ్స్)
  • సీట్ బెల్ట్‌ రిమైండర్స్‌
  • బెల్ట్‌ ప్రీ-టెన్షనర్స్‌
  • బెల్ట్‌ బోల్ట్‌-లిమిటర్‌
  • ISOFIX యాంకరేజెస్‌
  • ఏడీఏఎస్‌ (అడిషనల్)

Tata Safari Price : మార్కెట్లో ఈ టాటా సఫారీ కారు ధర సుమారుగా రూ.15.49 లక్షలు - రూ.26.79 లక్షలు (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

4. Tata Harrier : టాటా కంపెనీ విడుదల చేసిన సేఫెస్ట్‌ కార్లలో టాటా హారియర్ ఒకటి. ఈ కారు కూడా గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారులో కూడా ఏఈబీ, బీఎస్‌డీ లాంటి చాలా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఫ్యామిలీ కోసం మంచి సురక్షితమైన కారు కొనాలని అనుకునేవారు ఈ టాటా హారియర్‌పై ఓ లుక్కేయవచ్చు.

Tata Harrier Safety Features :

  • 7 ఎయిర్‌బ్యాగ్స్‌
  • యాంటీ-లాక్‌ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్‌)
  • సెంట్రల్ లాకింగ్‌
  • చైల్డ్ సేఫ్టీ లాక్స్‌
  • యాంటీ-థెఫ్ట్ అలారమ్‌
  • డే & నైట్ రియర్ వ్యూ మిర్రర్‌
  • ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)
  • సీల్ట్ బెల్ట్‌ వార్నింగ్‌
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ (ఈఎస్‌సీ)

Tata Harrier Price : మార్కెట్లో ఈ టాటా హారియర్‌ కారు ధర సుమారుగా రూ.14.99 లక్షలు - రూ.25.89 లక్షలు (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

5. Maruti Suzuki Dzire : మారుతి సుజుకి కంపెనీ 2024 నవంబర్‌ నెలలో విడుదల చేసిన ఫోర్త్‌-జనరేషన్‌ డిజైర్ కారు సేఫ్టీపరంగా 5-స్టార్ రేటింగ్ పొందింది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, అడల్ట్‌ ఆక్యుపెన్సీలో 5 స్టార్ రేటింగ్‌, చైల్డ్ ఆక్యుపెన్సీలో 4 స్టార్ రేటింగ్ సంపాదించింది. ఈ మారుతి డిజైర్ కారులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఈఎస్‌సీ, పాదచారుల రక్షణ కోసం పొడెస్ట్రియన్ ప్రొడక్షన్ ఫీచర్లు ఉన్నాయి.

Maruti Suzuki Dzire Safety Features :

  • 6 ఎయిర్‌బ్యాగ్స్‌
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పీ)
  • రియర్ పార్కింగ్ సెన్సార్‌
  • ISOFIX ఛైల్డ్ సీట్ మౌంట్స్‌
  • రియర్ డీఫాగర్‌
  • సీట్‌-బెల్ట్ రిమైండర్‌
  • హిల్‌-హోల్డ్ అసిస్ట్‌
  • టైర్‌ ప్రెజర్ మోనటరింగ్ సిస్టమ్‌
  • 360 డిగ్రీ కెమెరా

Maruti Suzuki Dzire Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి డిజైర్‌ కారు ధర సుమారుగా రూ.6.79 లక్షలు - రూ.10.14 లక్షలు (ఎక్స్‌-షోరూం) ఉంటుంది.

రూ.10 లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్ కొనాలా? టాప్‌-10 మోడల్స్‌ ఇవే!

న్యూ ఇయర్‌లో మంచి 7-సీటర్ కార్‌ కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్‌-6 మోడల్స్‌ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.