ETV Bharat / state

ట్రాన్స్​ఫార్మర్​లో చెలరేగిన మంటలు.. అంటుకుని బూడిదైన చెట్టు

author img

By

Published : May 8, 2021, 5:28 PM IST

విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​లో సాంకేతిక సమస్యతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. భారీ ఈదురుగాలులు రావడంతో మంటలు రహదారిపైనున్న చెట్లకు అంటుకున్నాయి. ఫలితంగా వృక్షాలు కాలి బూడిదయ్యాయి.

ట్రాన్స్​ఫార్మర్​లో అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగి బూడిదైన చెట్టు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చిల్లకల్లు - మక్కపేట ఆర్​అండ్​బీ రహదారిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈదురు గాలులకు విద్యుత్ నియంత్రికలోని తీగలు ఒకగదానికి మరోటి అంటుకుని మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న భారీ వృక్షాలకు మంటలు వ్యాపించడంతో రోడ్డుపైనే చెట్లు కాలి బూడిదయ్యాయి.

క్రేన్ సాయంతో..

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అనంతరం క్రేన్ సాయంతో కాలిపోయిన చెట్లను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పక్కనే మొక్కజొన్న పంటకు మంటలు వ్యాపించకుండా సిబ్బంది చాకచాక్యంగా వ్యవహరించి మంటలను అదుపు చేశారు.

ఇవీ చూడండి:

కడప జిల్లా మామిళ్లపల్లె శివారులో పేలుడు.. 9 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.