FICCI Award in Agriculture: దిల్లీలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కిీ) సంస్థ రెెండవ సుస్థిర వ్యవసాయ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థలకు వివిధ కేటగిరీల క్రింద ఈ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. పర్యావరణహిత సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించినందుకు స్వచ్ఛంద సంస్థల కేటగిరీలో ఏఎఫ్ ఎకాలజీకి మొదటి బహుమతి అందజేశారు.
ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డా. వైవి మల్లారెడ్డికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలో పని చేస్తున్న పలు కార్పొరేట్ సంస్థలు, స్వచ్చంద సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, విదేశీ ప్రతినిధులు, ఫిక్కీ సంస్థ ప్రతినిధులు, ఎకాలజీ సెంటర్ సీనియర్ సిబ్బంది పాల్గొన్నారు.
వర్షాధార వ్యవసాయానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు వచ్చిందని డా. వైవి మల్లారెడ్డి తెలిపారు. రెైతులు పాటిస్తున్న సుస్థిర వ్యవసాయ పద్ధతులకు గుర్తింపుగా అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు.
ఇవీ చదవండి: