కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద ఉన్న వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావస్తున్నా కంచెర్ల వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేయకుండా... నిర్లక్ష్యం వహించటం తగదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. ఈ ఎత్తిపోతల పథకం కింద 17,500 ఎకరాల ఆయకట్టు సాగవుతోందని తెలిపారు.
ఎత్తిపోతల పథకం మరమ్మతులకు సంబంధించి రూ.ఏడు కోట్లు అంచనా వేసినా... బడ్జెట్ విడుదల చేయలేదని ఆంజనేయలు విమర్శించారు. వెంటనే నిధులు విడుదల చేసి.. మోటార్లు రిపేర్ చేసి, నీరు వదలాలని కోరారు. నిర్వహణకు సంబంధించి ఐడీసీ అధికారులు, ఎన్ఎస్పీ అధికారులు ఎవరూ సరైన బాధ్యత తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: