ETV Bharat / state

తెలంగాణకి ఇంకా అదనపు వాటా రావాల్సి ఉంది: సీఎం కేసీఆర్​

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సిద్ధం చేసిన సమాచారం, వివరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.

author img

By

Published : Aug 21, 2020, 9:46 AM IST

cm kcr on Apex Council Meeting
సీఎం కేసీఆర్​

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండో రోజు సమాలోచనలు జరిపారు. మొదటి రోజు సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం... నిన్న దానికి కొనసాగింపుగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, న్యాయనిపుణులతో చర్చించారు.

బుధవారం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సిద్ధం చేసిన సమాచారం, వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్​ పరిశీలించారు. వాటికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమైక్య రాష్ట్రంలో తీరని అన్యాయం జరిగిందని... దాన్ని సరిదిద్దకుండా ఉండడం ఏ మేరకు సబబని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం నదీజలాల్లో కేటాయింపులు చేయాలని కోరుతూ సెక్షన్ త్రీ ప్రకారం కోరినా కేంద్రం స్పందించలేదని... గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇంకా అదనపు వాటా రావాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

గత 53 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే గోదావరి నుంచి ప్రతిఏటా 3500 టీఎంసీలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయని, అందులో తెలంగాణకు అదనపు నీటిని కేటాయించాలని సీఎం వివరించారు. అన్ని అంశాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేదికగా ప్రస్తావించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నించాలని కేసీఆర్ అన్నారు. అటు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​కు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ కావడంతో ఆయన ఆసుప్రతిలో చేరారు. దీంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేడో, రేపో అధికారిక సమాచారం రావచ్చని అంటున్నారు.

ఇదీ చదవండి- సిబ్బంది మాట్లాడరు.. మందులివ్వరు.. సొంత వైద్యంతో అనర్థాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.