ETV Bharat / state

తమ పొలాలను ఇళ్ల స్థలాలుగా మారిస్తే.. ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతుల ఆందోళన - చండ్రగూడెంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం

కృష్ణా జిల్లా మైలవరం మండలం చండ్రగూడెం గ్రామ రైతులు... పోలీసులు, రెవెన్యూ అధికారులను ముప్పుతిప్పలు పెట్టారు. తాము సాగు చేసుకుంటున్న భూములను ఇళ్ల స్థలాలుగా మారిస్తే ఆత్మహత్య చేసుకుంటామని.. పురుగులమందు డబ్బాతో ఆందోళనకు దిగారు. వారిని శాంతింపజేసేందుకు పోలీసులు, అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు.

lash between police, farmers at chandra gudem,
రైతులను ఆపుతున్న పోలీసులు
author img

By

Published : Jun 29, 2020, 5:24 PM IST

కృష్ణా జిల్లా మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన రైతులు.... రెవెన్యూ అధికారులు, పోలీసులను కంగారు పెట్టించారు. తాము సాగు చేస్తున్న భూములను.. ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ పురుగుల మందు డబ్బాలు పట్టుకుని తలోదిక్కూ పరిగెత్తారు. వారిని ఆపడానికి మైలవరం రెవెన్యూ సిబ్బంది, ఎస్ఐ ఈశ్వరరావు, పోలీస్ సిబ్బంది పరుగులు పెట్టాల్సి వచ్చింది.

ప్రభుత్వ స్థలం కాబట్టి దాన్ని పేదలకు ఇస్తామంటూ రెవెన్యూ సిబ్బంది స్థలాన్ని పరిశీలించి చదును చేయించడానికి వెళ్లారు. ముప్పై ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని రైతులు అడ్డం తిరిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పత్రాలు లేకుండా ఇలా హడావుడి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు నచ్చచెప్పడానికి ప్రయత్నించగా.. రైతులు పురుగుమందు డబ్బాలు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ అధికారులను బెదిరించారు. పరిస్థితి గందరగోళంగా మారేసరికి.. అప్పటికి పనులు ఆపి అధికారులు వెనక్కి వెళ్ళారు.

ఇదీ చదవండి:

నన్ను తప్పించేందుకు స్కెచ్ వేశారు: ఈటీవీ భారత్​తో రఘురామకృష్ణరాజు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.