కృష్ణాజిల్లా పెడన మండలం నందిగామలో తెదేపా మద్దతుదారులపై వైకాపా వర్గీయులు కత్తులతో దాడికి తెగబడటం.. ఉగ్రవాదానికి అద్దంపడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఓటమిని జీర్ణించుకోలేక సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ అరాచకాలపై ఎన్నికల సంఘం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రాజారెడ్డి పాలనకు వ్యతిరేకంగా పంచాయతీ ఎన్నికల్లో ప్రజాతీర్పును ఓర్వలేకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడని ఆక్షేపించారు. ఈ చీకటి పాలనను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
ఇదీ చదవండి: ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేకే వైకాపా దాడులు: తెదేపా