భారతరత్న అవార్డు గ్రహీత మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతిని ఆజాద్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఆజాద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆజాద్ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, దేశ మొదటి విద్యా శాఖ మంత్రిగా పలు సంస్కరణలు తీసుకు వచ్చిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సాజిద్ అలీ, కమిటీ ప్రతినిధులు మొహమ్మద్ హక్, సయ్యద్ మస్తాన్ షరీఫ్, షేక్ ఇబ్రహీం, సయ్యద్ నజీముద్దీన్, 59 వ డివిజన్ ఇంచార్జి షేక్ సుభాని...పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...సీఎంఆర్ఎఫ్ చెక్కుల కుంభకోణంలో నిందితుడు అదృశ్యం!