ETV Bharat / state

'బీసీలంటే వెన్నెముక వర్గాలుగా చూసే రోజులొచ్చాయి' - News today Ap Bc corporations

కృష్ణా జిల్లాలోని విజయవాడలో జగనన్న చేదోడు పథకాన్ని బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రారంభించారు. అనంతరం బీసీ కులాలకు మొదటి విడతగా రూ.247 కోట్లను పంపిణీ చేశారు.

జగనన్న పథకాన్ని ప్రారంభించిన బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన

author img

By

Published : Nov 10, 2020, 7:33 PM IST

Updated : Nov 10, 2020, 8:10 PM IST

బీసీలను వెనకబడిన తరగతులుగా చూసే రోజుల నుంచి బీసీ అంటే వెన్నెముక వర్గాలుగా చూసే రోజులొచ్చాయని బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించే అవకాశం రావటం పట్ల మంత్రి వేణుగోపాల కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. వైకాపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ఈ పథకం నేటి నుంచి అమలవుతోందని స్పష్టం చేశారు.

మొదటి విడతగా..

విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మంత్రితో పాటు ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఏనాదయ్య.. సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొదటి విడతగా 2,57, 040 మందికి ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నామని పేర్కొన్నారు. వారికి రూ. 247.04 కోట్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరి నుంచి సిఫార్సులు లేకుండా కేవలం అర్హత ఆధారంగానే లబ్ది చేకూరుతుందని మంత్రి వివరించారు.

139 కులాలకు 56 కార్పొరేషన్లు..

జగన్‌ సీఎం అయిన తర్వాత 139 కులాలకు.. 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిరారోగ్యశ్రీగా మార్చేసిందని ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి : జర్నలిస్ట్ నుంచి ప్లీడర్ దాకా.. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు రఘునందనమే

Last Updated : Nov 10, 2020, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.