కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘనంగా కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి విగ్రహానికి పూలమాలవేసి మండలి బుద్ధప్రసాద్ నివాళులు అర్పించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడమే కలాంకు అందించే నిజమైన నివాళని ఆయన అన్నారు. మానవ తప్పిదాల వల్లే తరచూ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నామన్నారు. యువత పర్యావరణ చట్టాలపై అవగాహన పెంచుకొని… పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఆదిశగా విద్యావంతులు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు.
ఇవీ చదవండి: నీట మునిగిన పంటలను పరిశీలించిన సీపీఎం నేతలు