Electricity Officers Notices To Villagers : ఎస్సీ కాలనీల్లోని కరెంట్ వినియోగదారులకు విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. ఏళ్ల తరబడి ఉన్న బకాయిలు చెల్లించాలని.. లేకుంటే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఆదేశాలు జారీ చేసింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట పంచాయతీ కొప్పవరం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు .. వేలల్లో వేసిన విద్యుత్ బిల్లులు చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ పథకం అమలులో ఉండగా.. అధిక మొత్తంలో వేలకు వేలు బిల్లులు వేసి ఒక్కసారిగా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. దాదాపు 8వేల నుంచి 25 వేల వరకూ బిల్లులు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. వినియోగదారుడి పేరుకి ఆధార్ మ్యాచింగ్ అవ్వకుంటే రాయితీ వర్తిచడం లేదంటున్న అధికారులు.. అందుకే బకాయిలు విడతల వారీగా కట్టుకోవాలని చెబుతున్నామన్నారు.
ఇవీ చదవండి: