జనసేన నేతపై వైకాపా నాయకుల దాడి - వైకాపా నాయకులు దాడిలు తాజా వార్తలు
జనసేన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాసరావు నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని వైకాపా నాయకులు దాడికి పాల్పడినట్లు జనసేన నాయకులు భావన్నారాయణ తెలిపారు.
జనసేన నేతపై వైకాపా నాయకుల దాడి
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి గ్రామానికి చెందిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీనివాసరావుపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. జనసేన పార్టీ తరుపున వేసిన నామినేషన్ను ఉపసంహరించుకోవాలని వైకాపా నాయకులు దాడికి పాల్పడినట్లు జనసేన నేత భావన్నారాయణ వివరించారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులపైనా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలిపారు. పోలీసులు తగిన చర్యలు తీసుకొని ఎన్నికల సజావుగా జరిగేల చూడాలన్నారు.
ఇవీ చూడండి...